'బాహుబలి 2' రోజునే 'సాహో'
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో `సాహో` సినిమాలో నటిస్తున్న గతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. `రన్ రాజా రన్` ఫేమ్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్తొకటి ఫిలింనగర్‌లో చక్కర్లుకొడుతుంది. ఈ వార్తల ప్రకారం `బాహుబలి 2` విడుదలైన రోజు ఏప్రిల్ 28నే `సాహో` చిత్రాన్ని విడుదల చేస్తారట. ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com