'బాహుబ‌లి 2' రోజునే 'సాహో'

  • IndiaGlitz, [Thursday,July 26 2018]

బాహుబ‌లితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో 'సాహో' సినిమాలో న‌టిస్తున్న గ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'ర‌న్ రాజా ర‌న్' ఫేమ్ సుజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ సినిమాను నిర్మిస్తుంది.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లుకొడుతుంది. ఈ వార్త‌ల ప్ర‌కారం 'బాహుబ‌లి 2' విడుద‌లైన రోజు ఏప్రిల్ 28నే 'సాహో' చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే మ‌రి.