'సాహో' ఇంట్రెస్టింగ్ అప్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్లో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సాహో`. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం టీజర్ విడుదలై ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్రెడి సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్, చంకీపాండే, జాకీష్రాఫ్, మందిరాబేడీలు విలన్స్‌గా నటిస్తున్నారు.
సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ రెండు రోల్స్లోనటిస్తుందట. అందులో ఒకటి నెగటివ్ రోల్ కూడా ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. మరి అదికారకంగా యూనిట్ దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి శంకర్ ఎహ్సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు త్వరలోనే ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments