'సాహో' ఇంట్రెస్టింగ్ అప్ డేట్...

  • IndiaGlitz, [Saturday,September 09 2017]

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ రేంజ్‌లో స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అల్రెడి సినిమా చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమాను 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్, చంకీపాండే, జాకీష్రాఫ్‌, మందిరాబేడీలు విల‌న్స్‌గా న‌టిస్తున్నారు.

సినిమాలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ రెండు రోల్స్‌లోన‌టిస్తుంద‌ట‌. అందులో ఒక‌టి నెగటివ్ రోల్ కూడా ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి అదికార‌కంగా యూనిట్ దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

More News

అభిమానికి డార్లింగ్ కానుక...

అందరినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్రెబల్ స్టార్ ప్రభాస్.

వచ్చే వారం లిస్ట్ పెద్దదే

ఈ మధ్య కాలంలో ప్రతి వారం కనీసం రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

వి వై కంబైన్స్ బ్యానర్ లోగో విడుదల

శ్రీ సత్యన్నారాయణ బొక్క సమర్పణ సంస్థ లో వస్తున్న వి.వై బ్యానర్ మరియు లోగో ను దాసరి నారాయణ రావు గారి అబ్బాయి, నటుడు అరుణ్ కుమార్ చే విడుదల చేయించారు నిర్మాణ అధ్యక్షులు.

రామ్ కి మరోసారి కలిసొస్తుందా?

కందిరీగ తరువాత సరైన విజయం లేని యువ కథానాయకుడు రామ్ కి ఊరటనిచ్చిన చిత్రం నేను శైలజ.

తమన్నా మళ్లీ బిజీ

శ్రీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు,హ్యాపీడేస్ తో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది.