'సాహో' బిజినెస్.. టాలీవుడ్ టాక్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాహో'. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
బడ్జెట్ పరంగా (బాహుబలిని మినహాయిస్తే) తెలుగు సినిమాల పరంగా.. ఇప్పటి వరకు ఇదే హై బడ్జెట్ సినిమా కావడం విశేషం. సగం షూటింగ్ పూర్తయ్యేసరికే.. ఈ సినిమా నిర్మాతలకు హై రిటర్న్స్ తెచ్చిపెడుతోందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. హిందీ, తమిళ్ వెర్షన్లకు ఈ మూవీ థియేటరికల్, శాటిలైట్స్ హక్కులకు గాను యువి క్రియేషన్స్ కి రూ. 210 కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రూ.200 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్లు నిర్మాతలు వెల్లడిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణాలో రూ. 90 నుంచి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
ఈ బడ్జెట్ నాటకీయకంగా పెరగకపోతే తప్ప.. ఈ సినిమాపై నిర్మాతలు మంచి లాభాన్ని ఆశించవచ్చు. అలాగే కొంత రిస్క్ కూడా ఉంది. అదేమిటంటే.. సినిమా షూటింగ్ ఆలస్యం జరిగిందంటే 'బాహుబలి' క్రేజ్ అంత పోయే ప్రమాదం కూడా ఉంది. అది కొంత ప్రీ-రిలీజ్ బడ్జెట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేక పోలేదు. ఇలా 'సాహో' సినిమా ఎంత లాభాలతో ఊరిస్తుందో, అంతే రిస్క్ ని కూడా హెచ్చరిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com