'సాహో'లో మరో బాలీవుడ్ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి చిత్రంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా `సాహో`. `రన్‌రాజా రన్ ఫేమ్` సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. యు.వి.క్రియేషన్స్ బేనర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్, చంకీ పాండే విలన్స్‌గా నటిస్తున్నారు. వీరిద్దరే కాకుండా ఇప్పుడు మరో జాకీష్రాఫ్ కూడా ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నాడట. ఈ విషయాన్ని జాకీష్రాఫ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ రేంజ్ స్టార్ అని, తనపై నమ్మకంతో తనకు సాహో సినిమాలో అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపిన జాకీష్రాఫ్ బాహుబలి సినిమా చూశానని, రెండు భాగాలు ఎంతో నచ్చాయని కూడా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com