మహేశ్ స‌ర‌స‌న 'సాహో' బ్యూటీ

  • IndiaGlitz, [Saturday,April 18 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కీర్తిసురేశ్ పేరు ముందు విన‌ప‌డింది. త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ పేరు ఎక్కువ‌గా విన‌ప‌డింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు సాహోలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. మెచ్యూర్డ్ ల‌వ్‌స్టోరిగా ప‌రుశురామ్ ఈ సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని అంటున్నారు.

More News

ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్

జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్‌పై రాజ‌మౌళి సందేహం?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

చైత‌న్య నెక్ట్స్ ఆ ద‌ర్శ‌కుడితోనేనా..?

అక్కినేని నాగ‌చైత‌న్య సెన్సిటివ్ స‌బ్జెక్ట్స్‌ను డీల్ చేసే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాలో న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మహేశ్ లవ్‌స్టోరీ.. మ్యూజిక్ ఎవ‌రంటే?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా