బాయ్ ఫ్రెండ్ తో 'సాహో' బ్యూటీ సీక్రెట్ మ్యారేజ్

  • IndiaGlitz, [Monday,June 07 2021]

ప్రస్తుతం సినీ తరాల వివాహాలు ప్రవాహంలా జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లు సైలెంట్ గా పెళ్లిళ్లు చేసుకుంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. తాజాగా నటి ఎవెలిన్ శర్మ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు డాక్టర్ తుషాన్ ని వివాహమాడింది ఎవెలిన్ శర్మ.

వీరిద్దరి పెళ్లి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ప్రయివేట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. మే 15నే వీరిద్దరి వివాహం జరిగిపోయింది. కానీ ఎవెలిన్ మాత్రం ఇప్పుడే ఆ శుభవార్తని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎవెలిన్, తుషాన్ 2018లో ఓ పార్టీలో కలుసుకున్నారు. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది.

2019లో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ జంట వివాహబంధంతో ఒక్కటైంది. అందరి అటెన్షన్ పొందాలని అనుకోలేదు. అందుకే సింపుల్ గా పెళ్లి చేసుకున్నట్లు ఎవెలిన్ తెలిపింది.

ఎవెలిన్ శర్మ 'ఏ జవానీ హై దీవాని', 'కుచ్ కుచ్ లోచా హై' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఎవెలిన్ శర్మ ప్రభాస్ సాహోలో మెరిసింది. ఎవెలిన్ శర్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్.

More News

పవన్ కోర్టులో పూరి జగన్నాధ్ బంతి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నా కరోనా అడ్డుకట్ట వేస్తోంది.

హీరోతో రిలేషన్ షిప్.. ఇక దాగుడుమూతలు వద్దనుకుంటోందా?

బాలీవుడ్ ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ పర్సనల్ లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది.

ఇప్పటికే కన్ఫ్యూషన్ తో చస్తున్నాం.. మళ్ళీ గొడవెందుకు: బ్రహ్మానందం

వెండితెరకి దశాబ్దాలుగా ఏలుతున్న నవ్వుల రారాజు బ్రహ్మానందం. బ్రహ్మానందం కేవలం కమెడియన్ మాత్రమే కాదు..

డ్రగ్స్ వ్యవహారం.. అందుకే రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!

హీరోయిన్ సంజన టాలీవుడ్ లోకి సోగ్గాడు చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శత్వంలో 'బుజ్జిగాడు' చిత్రంలో నటించింది.

ఇదేం ట్విస్టు.. 'విరాటపర్వం' నక్సలిజం కథ కాదా ?

అవకాశం ఉన్నప్పటికీ దగ్గుబాటి రానా కమర్షియల్ చిత్రాలు జోలికి వెళ్లడం లేదు. బహుశా ఒకే రకమైన ఇమేజ్ లో ఇరుక్కుపోవడం ఇష్టం లేదేమో..