బాయ్ ఫ్రెండ్ తో 'సాహో' బ్యూటీ సీక్రెట్ మ్యారేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం సినీ తరాల వివాహాలు ప్రవాహంలా జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లు సైలెంట్ గా పెళ్లిళ్లు చేసుకుంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. తాజాగా నటి ఎవెలిన్ శర్మ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు డాక్టర్ తుషాన్ ని వివాహమాడింది ఎవెలిన్ శర్మ.
వీరిద్దరి పెళ్లి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ప్రయివేట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. మే 15నే వీరిద్దరి వివాహం జరిగిపోయింది. కానీ ఎవెలిన్ మాత్రం ఇప్పుడే ఆ శుభవార్తని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఎవెలిన్, తుషాన్ 2018లో ఓ పార్టీలో కలుసుకున్నారు. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది.
2019లో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ జంట వివాహబంధంతో ఒక్కటైంది. అందరి అటెన్షన్ పొందాలని అనుకోలేదు. అందుకే సింపుల్ గా పెళ్లి చేసుకున్నట్లు ఎవెలిన్ తెలిపింది.
ఎవెలిన్ శర్మ 'ఏ జవానీ హై దీవాని', 'కుచ్ కుచ్ లోచా హై' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఎవెలిన్ శర్మ ప్రభాస్ సాహోలో మెరిసింది. ఎవెలిన్ శర్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com