'సాహో' నటి భర్త హఠాన్మరణం.. కారణం ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బాలీవుడ్ నటి, టెలివిజన్ పర్సన్ అయిన మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మృతి చెందారు. 49 ఏళ్ల వయసులోనే ఆయన ఆకస్మిక మృతి చెందడంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం గొండెపోటు రావడంతో రాజ్ మరణించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అవికా గోర్ రొమాంటిక్ మూవీ టైటిల్ ఇదిగో!
దీనితో ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. రాజ్ కౌశల్ దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. ఆంటోని కౌన్ హై, షాదీ కా లడ్డు లాంటి చిత్రాలు రాజ్ కౌశల్ దర్శకత్వంలో తెరకెక్కాయి. అలాగే మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మేన్ దియా కబీ చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు.
రాజ్ కౌషల్, మందిరా బేడీని 1999లో వివాహం చేసుకున్నారు. మందిరా, రాజ్ జంటకు ఓ కుమారుడు సంతానం. వారి కొడుకు పేరు వీరేందర్ సింగ్. 2000లో తారా అనే పాపని రాజ్, మందిర దత్తత తీసుకున్నారు.
మందిరా బేడి సినిమాలు, బుల్లితెర షోలలో మెరుస్తూ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకుంది. ప్రభాస్ సాహో చిత్రంలో మందిరా బేడీ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. నేహా ధూపియా, రోహిత్ రాయ్, టిస్కా చోప్రా లాంటి ప్రముఖులంతా రాజ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com