ఎగ్జయిట్ అవుతున్న 'సాహో' భామ
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ అంటే చెట్ల చుట్టూ, గుట్టల చుట్టూ ఆడిపాడుతుందనే రోజులు కొండెక్కుతున్నాయి. నాలుగు పాటలు, పది సీన్లకు మాత్రమే పరిమితమయ్యే రోజులు ఇకపై ఉండవేమో. హీరోయిన్ అంటే సినిమాలో హీరోతో పాటు అంతో ఇంతో కష్టపడుతుందనే భావం వచ్చేస్తోంది. సినిమాల కోసం హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా కష్టపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కూడా అలాగే కష్టపడుతున్నారు.
ఆమె నటిస్తోన్న తొలి తెలుగు సినిమా `సాహో`. ఈ సినిమాలో శ్రద్ధా కూడా యాక్షన్ పార్ట్ లో యాక్ట్ చేశారట. చాలా వరకు డూప్‌లు లేకుండా సొంతంగానే యాక్షన్ చేసినట్టు ఆమె తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు ఒళ్లు హూనమైనప్పటికీ ఆ ఎగ్జయిటింగ్ ముందు, ఆ థ్రిల్ ముందు అదేం అంత పెద్దగా అనిపించలేదని అన్నారామె. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లు స్పీడుగా సాగుతున్నాయి. యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com