సాహసం శ్వాసగా సాగిపో సోకిల్లా సాంగ్ టీజర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంగీత సంచలనం ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న సాహసం శ్వాసగా సాగిపో ఆడియోను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..ఈ చిత్రంలో సోకిల్లా...అంటూ సాగే సాంగ్ టీజర్ ను హీరో నాగ చైతన్య, డైరెక్టర్ గౌతమ్ మీనన్, రైటర్ కోన వెంకట్ యుట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ టీజర్ ఈ సినిమా పై అంచనాలను పెంచేస్తుంది. ఏమాయ చేసావే కాంబినేషన్లో రూపొందుతున్న సాహసం శ్వాసగా సాగిపో...సెన్సేషన్ క్రియేట్ చేసి చైతు కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com