నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో ఆగస్ట్ 19న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యువసామ్రాట్ నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ఏమాయ చేసావె తర్వాత మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న మరో విభిన్న తరహా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య, గౌతమ్ మీనన్, ఎ.ఆర్.రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన ఏమాయ చేసావె మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన మరో మ్యూజికల్ సెన్సేషన్ సాహసం శ్వాసగా సాగిపో. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మరో మ్యూజికల్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వుంది చిత్ర యూనిట్.
యువసామ్రాట్ నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్ ఆర్థర్, ఎడిటింగ్: ఆంటోని, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com