24 గంటల్లోపే 24 లక్షల వ్యూస్ క్రాస్ చేసిన ఎస్ 3 టీజర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎస్ 3. ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటిస్తున్నారు. సింగం సిరీస్ లో మూడవ చిత్రంగా వస్తున్న ఎస్ 3 పై అటు తమిళ్, ఇటు తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ 3 టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ కు 24 గంటల్లోపే 24 లక్షల కు పైగా వ్యూస్ రావడం విశేషం.
అలాగే 75,000 లకు పైగా లైక్స్ రావడం మరో విశేషం. సింగం, సింగం 2 చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఎస్ 3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టు టీజర్ రికార్డ్ స్ధాయి వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. టీజరే ఈరేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తే...ఇక సినిమా ఏరేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com