నేను క్షేమంగానే ఉన్నాను:  ఎస్‌.జాన‌కి

  • IndiaGlitz, [Monday,June 29 2020]

ఆదివారం సాయంత్రం సంగీత ప్రేమికుల‌ను క‌ల‌వ‌ర పెట్టే వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇంత‌కీ అంద‌రినీ కంగారు పెట్టిన న్యూస్ ఏంటో తెలుసా? దిగ్గ‌జ గాయ‌ని ఎస్‌.జాన‌కి మ‌ర‌ణించారు. సోష‌ల్ మీడియాలో ఈ వార్త తెగ స్ప్రెడ్ అయ్యింది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు క‌లుగ జేసుకున్నారు. జాన‌కి ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలియ‌జేశారు. ఈ వివ‌ర‌ణతో అంర‌దూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గాసిప్‌పై గాయ‌ని ఎస్‌.జాన‌కి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆమె ఆడియో విడుద‌ల చేశారు. ‘‘నేను ఎక్కడో దూరంగా, క్షేమంగా ఉన్నాను. ఇలాంటి వార్త‌ల‌ను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవ‌రు క్రియేట్ చేస్తున్నారు? ఇలాంటి పిచ్చి వార్త‌ల‌ను క్రియేట్ చేయ‌కండి. ఇలాంటి వాటి వ‌ల్ల ఎవ‌రికీ ఉప‌యోగం. నేను క్షేమంగా ఉన్నాను. మీరు కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని జాగ్రత్త‌గా ఉండండి’’ అని తెలిపారు.

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా జాన‌క‌మ్మపై వ‌చ్చిన వార్త‌ల‌ను చూసి మండిప‌డ్డారు. ఆయ‌న వీడియో ద్వారా స్పందించారు. ‘‘ఏంటీ నాన్సెస్‌. నేను జాన‌క‌మ్మ‌గారితో మాట్లాడాను. ఆవిడ చాలా చాలా చాలా బావున్నారు. క‌ళాకారుల‌ను అమితంగా ప్రేమించే అభిమానులు ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను విన్న‌ప్పుడు వారికి ఏమైనా అయితే ఎవ‌రూ బాధ్య‌త వ‌హిస్తారు. సోష‌ల్ మీడియాను పాజిటివిటీని స్ప్రెడ్ చేయ‌డానికి వాడండి’’ అన్నారు.

More News

ఆ పుకారు ఎవరు పుట్టించారో కానీ..: రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఓ సినిమాలో నటిస్తున్నారంటూ పుకారు షికారు చేసింది. దీంతో ఆమెకు కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వెళ్లాయి.

‘జీ 5’లో సరికొత్త వినోదామృతం... (3 కొత్త ఎపిసోడ్స్ వచ్చాయి)

సంతోషానికి దివ్యఔషధం వినోదామృతం అని పెద్దలు చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించిన బుల్లితెర కార్యక్రమం ‘అమృతం’.

ఏపీలో నేడు 793 పాజిటివ్ కేసులు..

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీ కరోనా బులిటెన్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ

నేడు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదలడం సంచలనంగా మారింది.

తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వివాదంలో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.