'ఆర్ ఎక్స్ 100' తమిళ రీమేక్ హీరో ఎవరో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'ఆర్.ఎక్స్100'. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు.
తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరో పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆది పినిశెట్టి తెలియజేశారు.
'ఆర్.ఎక్స్100' సినిమాలో కంటెంట్ తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్మి సినిమాలో నటించడానికి అంగీకరించానని ఆది తెలిపారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments