శ్రావణిని దారుణంగా వేధించిన ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకూ దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి అకృత్యాలు మాత్రమే తెలిశాయి. తాజాగా ఆమె జీవితంలో ఆ ఇద్దరితో పాటు మరో కీలక పాత్ర పోషించిన ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత అశోక్ రెడ్డి అకృత్యాలు సైతం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్, సాయిలతో పాటు అశోక్‌రెడ్డి కూడా శ్రావణిని దారుణంగా వేధింపులకు గురి చేసినట్టు విచారణలో వెల్లడైంది. అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం 2017లో ఏర్పడింది.
అశోక్‌రెడ్డి రూపొందించిన ‘ఆర్ఎక్స్ 100’లో శ్రావణి అతిథి పాత్రలో నటించింది. ఈ సందర్భంగా శ్రావణి, అశోక్‌రెడ్డిల పరిచయం మరింత బటపడినట్టు తెలుస్తోంది. శ్రావణి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకున్న అశోక్‌రెడ్డి ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఆర్థిక సాయం చేసి.. దానిని అడ్డు పెట్టుకుని వేధింపులకు గురి చేసినట్టు సమాచారం. తనను కాదని.. వేరెవరిని వివాహం చేసుకున్నా ఊరుకునేది లేదంటూ అశోక్‌రెడ్డి శ్రావణిని బెదిరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం.
శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం అశోక్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే సాయి కూడా వచ్చినట్టు సమాచారం. అయితే ఈ వేధింపుల విషయాన్ని దేవరాజ్‌కు శ్రావణి చెప్పినట్టు తెలుస్తోంది. సాయి, అశోక్‌రెడ్డిలను దూరం పెడితేనే తాను శ్రావణిని పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ కండిషన్ పెట్టడమే కాకుండా.. ఆమె నుంచి కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులన్నింటి కారణంగా విసిగిపోయిన శ్రావణి చివరకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments