వివాదంలో 'ఆర్‌.ఎక్స్ 100' హీరో సినిమా

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

ఆర్.ఎక్స్ 100 అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొంద‌బోయే చిత్రంలోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ సినిమా కార‌ణంగా వివాదంలో చిక్కుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. జె.మోహ‌న్ కాంత్ దర్శ‌క‌త్వంలో 'సుపారి' అనే సినిమా రూపుదిద్దుకుంది. ఇది విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది.

అయితే తాను ఈ సినిమాలో న‌టించ‌లేదని.. డెమో షూట్ అని చెప్పి షూట్ చేసిన స‌న్నివేశాల‌ను ఈ సినిమా కోసం వాడుతున్నార‌ని కార్తికేయ సోష‌ల్ మీడియాలో ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఈ సినిమా నిర్మాత వేణు మాత్రం కార్తికేయ త‌మ చిత్రంలో న‌టించాడు. పాత్ర‌కు సంబంధించి డ‌బ్బింగ్ కూడా చెప్పాడని పెర్కొన‌డం గ‌మ‌నార్హం.