త‌మిళ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో కార్తికేయ‌

  • IndiaGlitz, [Saturday,August 04 2018]

తొలి చిత్రం 'ఆర్ ఎక్స్ 100'తో సెన్సేష‌ల్ హిట్ అవ‌డంతో హీరో కార్తికేయ‌కు మంచి పేరు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌ల‌కు మంచి తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని చూసిన త‌మిళ ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ సినిమా చేయ‌బోతున్నాడు.

ఆర్ ఎక్స్ 100 సినిమా చూసిన ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ ఓ క‌థ‌తో కార్తికేయ‌ను సంప్ర‌దించాడ‌ట‌. కార్తికేయ‌కు క‌థ చాలా బాగా న‌చ్చేసింది. సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ సినిమాను త‌మిళంలో ప్ర‌ముఖ నిర్మాత క‌లైపులి థాను నిర్మిస్తుండ‌టం విశేషం. మ‌రి ఈ సినిమా తెలుగు, త‌మిళంలో నిర్మిస్తారా లేక కేవ‌లం త‌మిళంలోనే నిర్మిస్తారా అనే దానిపై క్లారిటీ లేదు కానీ కార్తికేయ త‌న రెండో సినిమా విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.