బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌లకు ఆదరణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజయం సాధించిన `అర్జున్ రెడ్డి` చిత్రాన్ని హిందీలో `కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద సక్సెస్‌ను సాధించిన ఆర్.ఎక్స్ 100ను బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను తమిళం, కన్నడలో రీమేక్ చేస్తున్నారు.
ఇప్పుడు బాలీవుడ్‌లో సాజిద్ నదియావాలా ఈ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారట. సీనియర్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ రీమేక్‌లో నటించబోతున్నారు. `డర్టీపిక్చర్`ను డైరెక్ట్ చేసిన మిలన్ లూత్రియా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments