RX 100 Review
తెలుగు సినిమా కొత్త దారిలో అడుగుపెట్టింది. కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలకు ఆదరణ లభిస్తున్నాయి. కొత్త నటీనటులున్నా కూడా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్‌తో దర్శకుడు అజయ్‌భూపతి చేసిన ప్రయత్నమే `ఆర్ ఎక్స్ 100`. సినిమా ట్రైలర్ బోల్డ్‌గా ఉండటంతో .. పాటు సినిమాలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను చూపించామని దర్శకుడు అజయ్ భూపతి చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అని తెలియాలంటే కథేంటో చూద్దాం...
కథ:
అత్రేయ పురంలో జెడ్.పి.టి.సి విశ్వనాథం(రావు రమేశ్), డాడి(రాంకీ) మంచి స్నేహితులు. డాడి.. శివ(కార్తికేయ)ని పెంచి పెద్ద చేస్తాడు. సెలవులకు ఊరికి వచ్చిన విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్) శివను ప్రేమిస్తుంది. శివ కూడా ఇందుని ప్రేమిస్తాడు. ఇద్దరూ జంటగా తిరుగుతుంటారు. పెళ్లి విషయం మాట్లాడతానని ఓ రోజు ఇందులో ఇంటికి వెళుతుంది. కానీ ఆమె తండ్రి విశ్వనాథం బలవంతంతో మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. శివను విశ్వనాథం మనుషులు కొట్టి పడేస్తారు. ఇందు అమెరికా వెళ్లిపోతుంది. ఇందు ప్రేమలో శివ పిచ్చివాడిలా మూడేళ్లు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓరోజు ఇందు అత్రేయపురం వస్తుంది. అప్పుడు శివ ఆమెను కలవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఇందు శివను కలవదు. ఎందుకు? అసలు శివ, ఇందు మధ్య ప్రేమ నిజమేనా? చివరకు శివ, ఇందుల పరిస్థితేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ప్లస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్స్.. హీరో కార్తికేయ దాదాపు కొత్తవాడే అయినా.. ఓ ఎమోషనల్ పాత్రను బాగా క్యారీ చేశాడు. అలాగే పాయల్ పంజాబీలో ఫిలింఫేర్ అవార్డ్ విన్నర్ కాబట్టి ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. అది చివరి వరకు సస్పెన్స్‌లో సాగుతుంది. పాయల్ ఆమె పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఇక చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ట్యూన్స్ బావున్నాయి. రామ్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రేమలో కొత్త కోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథలో ట్విస్ట్ బావుంది. అలాగే క్లైమాక్స్ పదినిమిషాలు బావుంది. దర్శకుడు అజయ్ భూపతి ప్రేమలో కొత్త ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను చక్కగా డిజైన్ చేశాడు. అలాగే ఇతర పాత్రలను బలంగా మలిచారు. సినిమా ఆసాంతం నాలుగు పాత్రలమీదనే సాగిందంటే పాత్రలను ఎంత గొప్పగా రాసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పాటలు చాలా బావున్నాయి. ముఖ్యంగా పిల్లారా ... సాంగ్, కొడవలి నిండా... పాటలు వినడానికే కాదు చూడటానికి బావున్నాయి. రామ్ సినిమాటోగ్రఫీ బావుంది.
మైనస్ పాయింట్స్:
ప్రేమకథలో ఎమోషన్స్‌ను ఫస్టాఫ్‌లో మిస్ చేసినట్టు కనపడింది. సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాయింట్స్ తక్కువగా కనపడ్డాయి. డైలాగ్స్‌ను నెమ్మదిగా పలికించడం .. వంటివి సినిమాకు ఏ విధమైన లాభాన్ని చేకూర్చలేకపోయాయి. ఎడిటర్ ప్రవీణ సినిమా లెంగ్త్‌ను కాస్త తగ్గించి ఉంటే బావుండేదనిపించింది.
సమీక్ష:
దర్శకుడు హీరో, హీరోయిన్ రొమాన్స్‌ను పొట్రేట్ చేసిన తీరు ..ఓ ఫ్యామిలీతో థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. రావు రమేశ్ పాత్రను చక్కగా చిత్రీకరించారు. డాడి పాత్రలో రాంకీని ఇంకాస్త బెటర్‌గా ఎలివేట్ చేసుండొచ్చు. కానీ చేయలేకపోయారేమో అనిపిస్తుంది. సినిమా వ్యవథి మరో ఇరవై నిమిషాలు తగ్గించి ఉంటే టెంపో సరిపోయేదనిపించింది. దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ, కథనం ఇంకా ఆసక్తికరంగా అల్లుకుని ఉంటే బావుండేదనిపించింది.
బోటమ్ లైన్: ఆర్.ఎక్స్ 100... ప్రేమలో కొత్త కోణం
RX 100 Movie Review in English
- Read in English