జులై 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ 'RX 100'

  • IndiaGlitz, [Monday,June 04 2018]

మా 'RX 100'టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ వ‌చ్చాయి. ఓ చిన్న చిత్రం టీజ‌ర్‌కి ఇన్ని వ్యూస్ రావ‌డం అరుదైన విష‌యం. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి బిజినెస్ వ‌ర్గాల్లోనూ మా సినిమాకు క్రేజ్ అమితంగా పెరిగింది'' అని అంటున్నారు అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌. KCW  బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌చిత్రం 'RX 100'. ఈ  చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి.  An Incredible Love Story  అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌.   కార్తికేయ, పాయల్ రాజపుత్‌  హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక  పాత్రధారులు.

దర్శ‌కుడు అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ '' ఓ చిన్న టౌన్ నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీ ఇది. RX 100 బైక్ సౌండ్‌లోనే తెలియ‌ని పొగ‌రు ఉంటుంది. మా హీరో శివ పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఒక ర‌క‌మైన నిర్ల‌క్ష్య ధోర‌ణితో సాగే పాత్ర అత‌నిది. తెలుగులో ఇలాంటి ప్రేమ‌క‌థ ఇప్ప‌టివ‌ర‌కూ రాలేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. చిన్న చిత్రం టీజ‌ర్‌కి ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ రావ‌డ‌మంటే తేలికైన విష‌యం కాదు. మా టీజ‌ర్‌ను అంత‌లా ఆద‌రించిన వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు. సినిమా కూడా అంత‌కు వెయ్యి రెట్లు మెప్పిస్తుంది'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ '' టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి బిజినెస్ వ‌ర్

More News

తెలుగు ద‌ర్శ‌కుల‌తో హిందీ చిత్రాలు

‘మనసుకు నచ్చింది’,  ‘రాజుగాడు’ చిత్రాల‌తో తెలుగు వారిని ప‌ల‌క‌రించిన ఉత్త‌రాది భామ అమైరా ద‌స్తూర్‌.

గ్రామీణ నేపథ్యంలో వెంకీ, చైతు సినిమా?

విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో

ద‌స‌రా టార్గెట్‌గా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌?

సమ్మర్ సీజన్ ముగిసింది. ఈ నేప‌థ్యంలో.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన‌ సినిమాలు కొన్ని విజయ దశమిని టార్గెట్ చేస్తూ చిత్రీకరణను కొనసాగిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, రవితేజ బాటలో రాజ్ తరుణ్?

‘ఉయ్యాలా జంపాలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

పి.సి.శ్రీ‌రామ్ ట్రాక్ రికార్డ్ ప్ల‌స్ అవుతుందా?

ద‌క్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన కెమెరా పనితనంతో గొప్ప చిత్రాలుగా మలచిన ఘ‌న‌త‌ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సొంతం.