ఆర్ ఎక్స్ 100 డైరెక్ట‌ర్ త‌దుప‌రి సినిమాలు ...

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడిగా 'ఆర్ ఎక్స్ 100' సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. మాస్ ఆడియెన్స్ ప‌ల్స్‌ను ప‌ట్టాడు. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

అయితే మ‌న టాలీవుడ్ నిర్మాత‌లు అజ‌య్‌తో సినిమా చేయ‌డానికి అడ్వాన్సులు ఇస్తున్నార‌ట‌. భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్, నితిన్ కోసం మంచి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి, రామ్ కోసం మంచి స్క్రిప్ట్ చేయ‌మ‌ని స్ర‌వంతి ర‌వికిశోర్ కోరార‌ట‌. మ‌రి అజ‌య్ భూప‌తి ఎవ‌రితో సినిమా చేస్తాడో చూడాలి మ‌రి.