క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్.. వ్యాక్సిన్ తయారీలో రష్యా ముందడుగు..
- IndiaGlitz, [Monday,July 13 2020]
కరోనా ప్రయోగాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తెచ్చి తమ దేశ ఖ్యాతిని పెంపొందించుకునేందుకు దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఇతర దేశాల కంటే రష్యా ఒకడుగు ముందుకేసింది. కరోనా టీకాపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ’ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న తొలి దేశం తమదేనని ప్రకటించింది. ర
ష్యాలోని గమేలెయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన టీకాపై సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించింది. జూన్ 18న ప్రారంభమైన ఈ పరీక్షలు ముగిశాయని.. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వలంటీర్ల బృందాన్ని బుధవారం, రెండో బృందాన్ని ఈ నెల 20న డిశ్చార్జ్ చేస్తామని వివరించింది. కోవిడ్ 19 ప్రపంచపు మొదటి వ్యాక్సిన్ వలంటీర్‌లపై టెస్టులను సచ్‌నోవ్ యూనివర్సిటీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. వ్యాక్సిన్ సేఫ్‌గా ఉంది. వలంటీర్లు అంతా ఈ నెల 15న కొందరు, 20న కొందరిని డిశ్చార్జ్ చేస్తాం’’ అని ట్విట్టర్ వేదికగా.. సెచ్‌నోవ్ వర్సిటీకి చెందిన చీఫ్ రిసెర్చర్ ఎలీనా తెలిపారు.