మహమ్మద్ రఫీ పాట పాడిన రష్యన్ మిలటరీ

  • IndiaGlitz, [Saturday,November 30 2019]

సినీ ప్రియులకు మరీముఖ్యంగా గాన ప్రియులకు మహ్మద్ రఫీ పేరు పరిచయం చేయనక్కర్లేదు. తన మధురగానంతో యావద్భారతాన్నీ ఆనందడోలికల్లో తేలేలాచేసిన గాయకుడు మహ్మద్ రఫీ. ఆయన మధురగానం తెలుగునాట సైతం విశేషాదరణ పొందింది. రఫీ గానం మది మదినీ పులకింపచేస్తూ సాగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. హిందీ చిత్రసీమ గాయకుల్లో మహ్మద్ రఫీ మేరునగధీరుడు. రఫీకి ముందు, తరువాత ఎందరు గాయకులు ఉన్నా, వచ్చినా ఆయన గాత్రంలోని మాధుర్యం ఆకట్టుకున్న తీరేవేరు. అలాంటి రఫీ మనముందు లేకున్నా.. ఆయన పాటలు ఎప్పుడూ సజీవంగానే ఉంటాయ్.

‘అయే వతన్..’
కాగా.. ఆయన పాటు దేశాలను దాటేశాయ్.. రష్యాలో సైతం రఫీ పాట మార్మోగుతోందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికొస్తే.. రష్యా మిలటరీ క్యాడెట్లు 1965లో వచ్చిన ‘షాహీద్’ చిత్రంలోని దేశభక్తి గీతం ‘అయే వతన్..’ అనే సాంగ్ పాడారు. ప్రస్తుతం వారు పాడిన ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 27 సెకన్ల వీడియోను ఓ ప్రముఖ వార్తా సంస్థ ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది. మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మిలటరీ క్యాడెట్లు ‘అయే వతన్..’ అంటూ పాడారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో సైనిక సలహాదారు బ్రిగేడియర్ రాజేష్ పుష్కర్ కూడా క్యాడెట్లతో పాటు పాడినట్లు వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపిస్తుందోని కొందరు నెటిజన్లు చెబుతుండగా.. మరికొందరు మాత్రం నిజంగా రఫీగారు చాలా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

More News

సీఎం జగన్ ఆర్నెల్ల పాలనపై టీడీపీ పుస్తకం.. సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మీ వల్లే అత్యాచారాలంటూ హీరోయిన్‌పై కామెంట్‌.. ఆమె ఏం చేసిందంటే?

సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచం మారుతున్న కాలానికి అనుగుణంగా మూవీ మేకింగ్‌లో చాలా మార్పులు వస్తున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ అప్పుడేనా?

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్‌ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రమిది.

ఈసారైనా వర్కవుట్‌ అవుద్దా?

ఎనర్జిటిక్‌స్టార్‌ రామ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం ఓ సినిమాను రూపొందించడానికి నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ప్రయత్నం చేశాడు.

ఆ నలుగుర్ని చంపి.. నేను జైలుకెళ్తా : పూనమ్

వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇదే ప్రాంతంలో