Viral Video: మహిళ కడుపులో 4 అడుగుల పాము... బయటికి తీసిన డాక్టర్లు, చివరికి షాక్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడప్పుడు వైద్యులు కొన్ని అరుదైన ఆపరేషన్లు చేసిన ఫోటోలు, వీడియోలు మీడియాలో కనిపిస్తే అంతా షాక్‌కు గురవుతాం. అసలు ఇలా కూడా జరుగుతుందా అనేంతంగా ఆ సంఘటనలు వుంటాయి. ఫలానా వ్యక్తి కిడ్నీ నుంచి వందలాది రాళ్లు బయటకు తీయడం, కిలోలకొద్దీ పెరిగిన ట్యూమర్లు చూసే వుంటాం. కానీ వీటన్నింటికి భిన్నంగా ఓ షాకింగ్ ఘటన రష్యాలో వెలుగులోకి వచ్చింది. ఇది అలాంటి ఇలాంటిది కాదు.. ఆ వీడియో చూస్తే మన వెన్నులో వణుకు రావడం గ్యారెంటీ.
రిపోర్ట్స్ చూసి షాకైన డాక్టర్లు :
వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ మహిళ ఇటీవల గాఢ నిద్రలో వుండగా.. కడుపునొప్పి వచ్చింది. కేకలు పెడుతూ.. స్పృహతప్పి పడిపోయింది. ఏం జరిగిందోనని కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పలు పరీక్షలు చేసిన వైద్యులు... రిపోర్ట్స్ చూసి షాక్‌కు గురయ్యారు. కారణం.. ఆమె కడుపులో దాదాపు 4 అడుగుల పొడవైన పాము వుండటం. చివరికి అతికష్టం మీద బాధితురాలి నోటి గుండా ఆ పామును బయటకు తీశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఆపరేషన్ జరిగి, ఇన్ని గంటల పాటు మహిళ పొట్టలో వున్నప్పటికీ ఆ పాము బ్రతికే వుంది. దీనిని చూసి వైద్యులు సైతం షాక్‌కు గురవుతున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదంతా సరే గానీ.. అసలు ఆ పాము మహిళ కడుపులోకి ఎలా వెళ్లింది. కడుపులో కదులుతున్నా ఆమెకు ఇన్ని రోజులు తెలియలేదా.? . ఇలా రకరకాల అనుమానాలు నెటిజన్లను వేధిస్తున్నాయి.
Medics pull 4ft snake from woman’s mouth after it slithered down there while she slept. pic.twitter.com/oHaJShZT3R
— Fascinating Facts (@FascinateFlix) November 12, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com