ఉక్రెయిన్‌లో తెలుగువారి అవస్థలు: తరలింపుపై ఏపీ, తెలంగాణ ఫోకస్, హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచం ఉలిక్కిపడింది. ఏ మాత్రం ఊహించని ఈ పరిణామంతో ప్రపంచ దేశాలన్నీ దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. పుతిన్‌ను నిలువరించేందుకు అమెరికా సహా ఆయా దేశాలు రంగంలోకి దిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న రాత్రి పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని మానుకుని.. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు. అయినప్పటికీ రష్యా అధినేత ఏ మాత్రం తగ్గడం లేదు.
అయితే ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అక్కడ వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు విద్యార్ధులు కూడా వున్నారు. ఈ క్రమంలో వీరి క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్రం తేల్చగా.. ఇప్పటికే 4 వేల మంది వరకు స్వదేశానికి తిరిగి వచ్చినట్టు ప్రకటించింది.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా వారి విద్యార్ధుల తరలింపుపై అప్రమత్తం అయ్యాయి. తెలంగాణ విద్యార్థులకు తగిన సాయం అందించేందుకు ఢిల్లీతోపాటు తెలంగాణ సెక్రెటేరియట్‌లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కూడా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన నెంబర్లు
విక్రమ్ సింఘ్ మాన్: +91 7042566955
చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270
నితిన్ ఓఎస్డీ: +91 9654663661
ఈ-మెయిల్ ఐడీ: rctelangana@gmail.com
హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సిన నెంబర్లు
చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433
ఈ-మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in
ఏపీ హెల్ప్ లైన్ నెంబర్లు
ఎంవీఎస్ రామారావు, ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్: 9871990081
ఏఎస్‌ఆర్‌ఎన్ సాయిబాబు, ఏపీ భవన్ ఓఎస్డీ: 9871999430
పి.రవిశంకర్, నోడల్ అధికారి: 9871999055
లోకల్ హెల్ప్ లైన్ నంబర్: 0863-2340678
వాట్సాప్ నంబర్: +91 8500027678
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout