గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. 12న అందుబాటులోకి వ్యాక్సిన్
- IndiaGlitz, [Saturday,August 08 2020]
కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటాపోటీగా పని చేస్తున్నాయి. అన్నింటి కంటే ఈ పోటీలో రష్యా ముందుంది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 12 నుంచి వ్యాక్సిన్ ఏకంగా అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. ఉఫా నగరంలో జరిగిన ఓ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో గృందేవ్ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీన తమ దేశం రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ జరగనుందని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని గృందేవ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ముందుగా కరోనా పోరులో ఫ్రంట్ లైనులో ఉన్న వైద్య సిబ్బందికి, వృద్ధులకు అందిస్తామని వెల్లడించారు. కాగా.. ఈ ప్రకటనతో శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. వ్యాక్సిన్‌ను అన్ని ట్రయల్స్ పూర్తయిన అనంతరం మాత్రమే విడుదల చేయాలని సూచిస్తున్నారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో సైతం సూచనలు చేసింది. వ్యాక్సిన్‌కు సంబంధించి అన్ని రకాల గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలని సూచించింది.