గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. వ్యాక్సిన్ వచ్చేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ మానవాళికి రష్యా గుడ్ న్యూస్ అందించింది. మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్.. రష్యా ఆరోగ్యశాఖ ఆమోదం పొందింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ఈ శుభవార్తను అందించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం పొందిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం రష్యాగా నిలిచిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సగర్వంగా వెల్లడించారు. ఇది తమ దేశ శాస్త్రీయ పరాక్రమానికి సాక్ష్యంగా మాస్కో అభివర్ణించింది. తన కుమార్తెకు టీకా వేసినట్లు పుతిన్ వెల్లడించారు.
ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్న రష్యా జనాభా కోసం పెద్ద మొత్తంలో టీకాల తయారీకి ఈ ఆమోదం మార్గం చూపిందని పుతిన్ పేర్కొన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ అభివృద్ధి కోసం దేశాలన్నీ పరిగెడుతున్న సమయంలో వ్యాక్సిన్‌ను అందరికంటే ముందుగా అందుబాటులోకి తీసుకురావడమనేది ఈ రేసును గెలవాలనే ధృఢ నిశ్చయాన్ని హైలైట్ చేస్తోంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న రష్యా ఆరోగ్య కార్యకర్తలకు.. టీకా ఆమోదం పొందిన వెంటనే స్వచ్ఛందంగా టీకాలు వేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కాగా నేడు జరిగిన ప్రభుత్వ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మాస్కోలోని గమలేయ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన టీకా సురక్షితమని, అది తన కుమార్తెలలో ఒకరికి ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘"ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నాకు తెలుసు. బలమైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అన్ని పరీక్షలనూ అధిగమించిందని మరలా చెబుతున్నా’’ అని పుతిన్ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తిని దేశం త్వరలోనే ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధిలో భాగంగా భద్రత విషయంలో రష్యా ఏమాత్రం రాజీపడదని పుతిన్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments