ఆ ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడాల‌ని మీద చేయి వేశాడంటున్న హీరోయిన్

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

హాలీవుడ్‌లో ప్రారంభ‌మైన మీటూ ఉద్య‌మం బాలీవుడ్ అటు నుండి ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌కు పాకింది. ఇప్పుడు ఈ మీటూ ఉద్యమం బెంగాళీ ప‌రిశ్ర‌మ‌ను తాకింది. ప్ర‌ముఖ బెంగాళీ ద‌ర్శ‌కుడు అరిందం సిల్ త‌ను లైంగికంగా వేధించాడ‌ని న‌టి రూపాంజ‌న మిత్ర రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆరోప‌ణ‌లు చేశారు. భూమిక‌న్య అనే స్క్రిప్ట్‌ను చ‌ర్చించ‌డానికి ఆఫీసుకి ర‌మ్మంటే వెళ్లాను. అక్క‌డ స్క్రిప్ట్ ఇచ్చి తొలి ఎపిసోడ్ చ‌ద‌మ‌ని అన్నారు. అక్క‌డెవ‌రూ లేక‌పోవ‌డంతో నాకెందుకో తేడాగా అనిపించింది.

ద‌ర్శ‌కుడు ఉన్న‌ట్లుండి లేచిన నా ముఖ్యాన్ని, భుజాన్ని నిమిరాడు. అత్యాచారం జ‌రుగుతుందేమోన‌ని భ‌య‌ప‌డ్డాను. ఆ గ‌దిలోకి ఎవ‌రైనా రావాల‌ని ప్రార్థించాను. 'నాతో స్క్రిప్ట్ గురించి మాత్ర‌మే మాట్లాడండి.. అని గట్టిగా చెప్పాను' త‌న ఎత్తుగ‌డ‌లు నా ద‌గ్గ‌ర ప‌నిచేయ‌వ‌ని త‌న‌కు అర్థ‌మైంది. వెంట‌నే ఆయ‌న స్క్రిప్ట్ గురించి వివ‌రించ‌డం మొద‌లు పెట్టాడు. ఆ త‌ర్వాత ఐదు నిమిషాల‌కు ఆయ‌న భార్య ఆఫీసుకి వ‌చ్చింది. అక్క‌డి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన నేను గుక్క‌ప‌ట్టి ఏడ్చేశాను. ఛాన‌ల్‌తో ఉన్న ఒప్పందం ప్ర‌కారం ఆ విష‌యాన్ని అప్పుడు చెప్ప‌లేక‌పోయానని ఆమె తెలిపారు.

ఈ వ్య‌వ‌హారంపై అరింద‌ల్ స్పందిస్తూ ఆమె వ్యాఖ్యాల‌ను ఖండించారు. ఇది రాజ‌కీయం. ఆమె ఎందుకు చెప్పారో నాకు అర్థం కావ‌డం లేదు. మేం పాత స్నేహితులం. నేను వేధించాన‌ని చెప్పిన రోజు నేను చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాన‌ని మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూపించ‌గ‌ల‌ను. నేను త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించి ఉంటే ఆ మెసేజ్‌ను ఎలా చేయ‌గ‌ల‌రు అని తెలిపారు.