శ్రీకారం చుట్టుకున్న'రుణం'

  • IndiaGlitz, [Wednesday,October 18 2017]

జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి ఋణపడుతూ ఉంటాడు. అది గుర్తు పెట్టుకొని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథ పాతాళానికి తొక్కుతుంది. అత్యాశ వల్ల జరిగే అనర్ధాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం "రుణం" చిత్రంతో అంటున్నారు చిత్ర దర్శకులు ఎస్.గుండ్రెడ్డి. బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న "రుణం"చిత్రంలో గోపికృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా.. శిల్ప-తేజు-ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంస్థ కార్యాలయంలో.. పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం.. ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. చిత్ర నిర్మాతలు భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు, చిత్ర సమర్పకులు గాలిరెడ్డి, దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి, హీరోలు గోపికృష్ణ-మహేంద్ర, హీరోయిన్ ప్రియాంక, విలన్ పాత్రధారి ప్రదీప్ ప్రత్తికొండ, సంగీత దర్శకుడు ఎస్.వి.మల్లిక్ తేజ పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభించి.. సింగిల్ షెద్యూల్ లో "రుణం" షూటింగ్ పూర్తి చేయనున్నామని నిర్మాతలు తెలుపగా.. ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణ పడి ఉంటామని హీరోలు పేర్కొన్నారు. హిందీలో ఒకటి, కన్నడలో నాలుగు సినిమాలు చేసిన తనను "రుణం" చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాతలకు దర్శకుడు ఎస్.గుండ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. మానవ సంబంధాలు, మనస్తత్వాల నేపథ్యంలో రూపొందుతున్న"రుణం" సాధించబోయే విజయంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు.

ఏ.వెంకట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు, కథ-స్క్రీన్ ప్లే-సంభాషణలు-దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి!!

More News

24 డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?

ఇటీవలే జైలవకుశలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు యంగ్టైగర్ ఎన్టీఆర్. ఇక మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా తన గత చిత్రం 24లో సూర్యని మూడు పాత్రల్లో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఎన్టీఆర్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్.. మళ్లీ పవన్ డేట్ ?

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు.

'అలా ఎలా' ద‌ర్శ‌కుడితో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాల జంపాల చిత్రంతో క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేశాడు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. ఆ త‌రువాత సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్ విజ‌యాల‌తో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18 ఎం' ట్రైల‌ర్ విడుద‌ల

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా.. సాయిధ‌ర‌మ్‌

నిరుద్యోగం వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా. వేరే అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్లే సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఎంచుకున్నానంటూ సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చెప్పుకొచ్చాడు.