సాహసం శ్వాసగా సాగిపో రన్ టైమ్..!
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య - గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య సరసన మంజిమ మోహన్ నటించింది. సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ అందించిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే...139 నిమిషాల 35 సెకన్లు అంటే...2 గంటల 19 నిమిషాల 35 సెకన్లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments