అల్లరి నరేష్ చేతుల మీదుగా రన్ ఆడియో రిలీజ్...
Sunday, March 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్, అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. తమిళ్ లో ఘన విజయం సాధించిన నేరమ్ సినిమాకి రీమేక్ గా రన్ రూపొందింది. సాయి కార్తీక్ సంగీతం అందించిన రన్ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం జె.ఆర్.సి ఫంక్షన్ హాల్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించగా... రన్ థియేటర్ ట్రైలర్ ను నిర్మాత ఎ.ఎం.రత్నం రిలీజ్ చేసారు.
కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ...ఇండస్ట్రీలో దేనికైనా టైం రావాలి. రన్ పెద్ద హిట్ అయ్యే సినిమా. రీమేక్ అయినా చాలా ప్లానింగ్ గా అనిల్ కృష్ణ తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతకు లాభాలు చేకూరుస్తుంది. సందీప్ ఈ సినిమాలో చాలా బాగా చేసాడు. టీమ్ కి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ వీరు పోట్లా మాట్లాడుతూ...ఇది టైమ్లీ మూవీ. ఈ కాన్సెప్ట్ అనిల్ గారు చెప్పగానే సందీప్ కి సరిగ్గా సరిపోయే సినిమా అనిపించింది. టీజర్ చూసినప్పుడు బాగుంది మంచి సినిమా అవుతుందని డైరెక్టర్ కి మెసేజ్ పెట్టాను. సందీప్ నేను కలసి సినిమా చేయాలి కానీ కుదరలేదు. ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ ఆల్ అన్నారు.
డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ...టైగర్ మూవీలో ఎలా ఉంటాడో సందీప్ కిషన్ అలాగే ఉంటాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ....సినిమా ఫీల్డ్ లో టైమ్ అంటే ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి బ్రహ్మాండమైన రన్ తో టైమ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కి బిగ్ హిట్ అయి మంచిపేరు తీసుకువస్తుంది. కొంత మంది నిర్మాతలకు మాస్, కొంత మందికి క్లాస్ ఇష్టం. కానీ..అనిల్ గార్కి క్లాస్ మాస్ రెండూ ఇష్టం. సందీప్ తో గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాను కుదరలేదు..టైమ్ వస్తే ఖచ్చితంగా చేస్తాం అన్నారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ...అందరికి గుడ్ టైమ్ - బ్యాడ్ టైమ్ రెండు వస్తాయి. సందీప్ కిషన్ లో ఏదో చేయాలనే తపన ఉంది. ఈ సినిమాతో మంచి టైమ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ అనిల్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ...ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు టైమ్ రావాలి. 30 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ లో చాలా చూసాను. సందీప్ కిషన్ కి సినిమా అంటే ఫేషన్ కాదు సినిమా అంటే పిచ్చి. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తున్న సందీప్ మరిన్ని మంచి సినిమాలు చేయాలి అన్నారు.
డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ...రన్ అంటే ఎవరి వెనకాల ఎవరు పడుతున్నారు అని ఆలోచించాను. టీజర్ చూసిన తర్వాత తెలిసింది ఇది టైమ్ చుట్టూ తిరిగే సినిమా అని. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ...రన్ ట్రైలర్ చూడగానే చాలా పాజిటివ్ గా అనిపించింది. హై స్టాండర్డ్స్ తో ఉంది. సినిమాని ఎంతగానో ప్రేమించే టీమ్ తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
డైరెక్టర్ అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ...సినిమాలో మీ డాన్స్ చూసుకోవాలనుకుంటే బాబాయ్ సాంగ్ కి వీడియో తీసి పంపిస్తే వచ్చిన వాటిలో బాగున్న వీడియోను సినిమాలో చూపిస్తాం. మలయాళంలో, తమిళ్ లో నేరమ్ అనే సినిమా తీసారు. అది నేను తెలుగులో చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో అందరూ సక్సెస్ ట్రాక్ ఎక్కుతామని నమ్మకం ఉంది. సాయి కార్తీక్ చాలా ఫాస్ట్ గా మ్యూజిక్ అందించారు అన్నారు.
నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ...సాంగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ కూడా బాగుంది. చాలా రోజుల క్రితం తమిళ్ లో రన్ అనే సినిమా తీసాను. పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ...రన్ రైట్స్ దొరకగానే సందీప్ కి కాల్ చేసి చెప్పాను. మనం ఈ సినిమా చేస్తున్నాం ఓకే అన్నాడు. సోల్ మిస్ అవ్వకుండా ఎలా చేయాలా అనుకున్నాను. అనిల్ నా దగ్గరికి వేరే కథ వచ్చాడు. ఈ సినిమా చేయమన్నాను. 24 క్రాఫ్ట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి అనిల్. ఒక మంచి క్యారెక్టర్ ఉంది హీరో అయితే బాగుంటుంది అనిపించి మహత్ ఫోన్ చేసాను. అడిగిన వెంటనే ఓకే చెప్పాడు. రఘ కుంచె ఈ సినిమాలో మంచి పాట చాలా బాగా పాడాడు. బాబీ సింహాను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ డే ఆయనను చూసినప్పుడు ఆయన ఊరు బందరూ అని తెలిసి చాలా హ్యాఫీగా ఫీలయ్యాను. సాయి కార్తీక్ నెక్ట్స్ ఇయర్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాని ఈనెల 23న రిలీజ్ చేస్తున్నాం. ఎకె ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అల్లరి నరేష్ తో సెల్పీ రాజా అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాం అన్నారు.
సాయి కార్తీక్ మాట్లాడుతూ...అనిల్ గారు చెప్పినట్టు చాలా స్పీడుగా తీసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తయ్యింది. సందీప్ కిషన్ పాటలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ పాటలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి అనుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ అనీష మాట్లాడుతూ...మంచి టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందకు థ్యాంక్స్. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది అన్నారు.
బాబీ సింహా మాట్లాడుతూ...ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు కానీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ కి థ్యాంక్స్. రన్ అంటే ఎనర్జి ఉంది. అలాగే సినిమాలో కూడా ఎనర్జి ఉంటుంది. తమిళ్ లో సందీప్ సినిమా చూసాను. కానీ లైఫ్ లో సందీప్ తో వర్క్ చేస్తానని అనుకోలేదు. మహత్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో మహత్ కి మంచి బ్రేక్ వస్తుంది. సాయి కార్తీక్ కి తెలుగు, తమిళ్ లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు వస్తుంది అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ...గత సంవత్సరం నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా మారాను. ఈ సినిమా చేయడం నాకు గుడ్ టైమ్ అని ఫీలింగ్. ఈ సినిమాతో ఓ మంచి టీమ్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ప్రస్ధానం తర్వాత అనిల్ కృష్ణ నాతో సినిమా చేయాలనుకున్నాడు. అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా వరకు డైరెక్టర్ చెప్పింది చేసాను. ఇక నుంచి అలాగే చేయాలనుకుంటున్నాను. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ అందించాడు. అల్లరి నరేష్ నా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి ఇది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ....ఒక నిర్మాత వరుసగా నాలుగు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఇది ఇండస్ట్రీకి మంచిది. గుడ్ టైమ్ వచ్చినా బ్యాడ్ టైమ్ వచ్చినా మారని మంచి మనిషి అనిల్ సుంకర గారు. ఇ.వి.వి బ్యానర్ నా సొంత బ్యానర్. ఈ బ్యానర్ అంతకు మించి. సందీప్ ఎప్పుడూ బిజీగా ఉండాలి. తమిళ్, మలయాళం కన్నా ఈ సినిమా తెలుగులో బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎలాంటి పాత్ర అయినా చేయగల బాబీ సింహా ఇందులో నటించారు.రన్ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ...ఫస్ట్ నలుగురిలో ఒకడుగా, ఆతర్వాత తమిళ్ లో ఓ సినిమా ఇప్పుడు తెలుగులో వెరైటీగా సినిమాలు చేస్తున్నాడు సందీప్. నన్ను చాలా ఇన్ స్పైయిర్ చేసాడు. ఈ సినిమా సందీప్ కి మంచి పేరు తీసుకురావాలి. బాబీ సింహాను ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ అని నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment