‘సాహో’ డైరెక్టర్ ఆరోగ్యంపై రూమర్స్.. అసలేం జరిగింది!
- IndiaGlitz, [Sunday,September 08 2019]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఆగస్టు-30న విడుదలైన ఈ చిత్రంపై మిక్స్డ్ టాక్ వినిపించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి సెకండ్ సినిమానే స్టార్ హీరో ప్రభాస్‌తో చేయడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సినిమా కథ.. ఎలా ఉంది..? అభిమానులను మెప్పించిందా..? లేదా..? అనేది పక్కనెడితే.. నిజంగా ఆయన ఆలోచన, డైరెక్షన్ మాత్రం హాలీవుడ్‌ను మించిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా నగ్నసత్యమే.
ఇదిలా ఉంటే.. సుజీత్‌కు ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ డెంగ్యూ సోకిందని వార్తలు వినవస్తున్నాయి. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా వెబ్సైట్లు ఇష్టానుసారం వార్తలు రాసేస్తున్నాయి. ఈ క్రమంలో సుజిత్ సన్నిహితులు ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.
సుజీత్ ఆరోగ్యం బాగానే ఉంది. వార్తల్లో వస్తున్నట్లు ఆయనకు డెంగ్యూ సోకలేదు. నార్మల్ జ్వరమే వచ్చిందంతే.. ఇందుకు ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు’ అని సుజిత్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే వార్తల్లో వచ్చే విషయాల్లో నిజమెంతుంది..? ఆయన సన్నిహితులు చెప్పే విషయాల్లో ఏ మాత్రం నిజానిజాలున్నాయ్..? అనేది తెలియాలంటే సుజిత్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.