చంద్ర మోహన్ చనిపోయారంటూ రూమర్స్.. ఇదీ అసలు సంగతి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారా ? ఈ అనుమానమే టాలీవుడ్ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. మొన్ననే అంటే మే 23న చంద్రమోహన్ 81 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అంతలోనే చంద్రమోహన్ ఇక లేరు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో పుకార్లు పుట్టేశాయి. చంద్ర మోహన్ చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవం. అయినా ఈ పుకారు ఎందుకు సృష్టించారు అని ఆరా తీయగా ఓ విషయం బయటపడింది.
చంద్రమోహన్ తన బర్త్ డే రోజున ఓ ప్రకటన చేశారు. ఇక సినిమాలు చేయనని, రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమాలకు ఇక సెలవు అనే వార్త మీడియాల్లో వచ్చింది.
ఇదీ చదవండి: 'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్
ఈ న్యూస్ కొందరికి తప్పుగా అర్థం అయింది. సినిమాలకు సెలవు అంటే..చంద్రమోహన్ ఇక సెలవు..ఆయన ఇక లేరు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అసలు మ్యాటర్. అంతే కానీ ఆయన చనిపోలేదు.
ప్రస్తుతం చంద్రమోహన్ కు ఆరోగ్యం సహకరించడం లేదు. రాఖీ టైమ్ లోనే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూనే ఉంది. బన్నీ డీజే షూటింగ్ లో కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. తన సమస్యల వల్ల నిర్మాతలని ఇబ్బంది పెట్టకూడదని చంద్రమోహన్ ఈ డెసిషన్ తీసుకున్నారు.
చంద్రమోహన్ గత 55 ఏళ్లుగా తన నటనతో మెప్పిస్తున్నారు. 1966 లో రంగులరాట్నం మొదలుకుని ఇటీవల డీజే, గౌతమ్ నంద వరకు నటిస్తూనే ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com