అఖిల్ మూవీపై రూమర్స్.. హమ్మయ్య అంటున్న అక్కినేని ఫ్యాన్స్

  • IndiaGlitz, [Monday,May 24 2021]

అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎప్పుడెక్కుతాడా అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అభిమానుల దృష్టంతా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంపైనే ఉంది. తొలి మూడు చిత్రాలలో అఖిల్ బాగా కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఉంటూ సరికొత్త పాయింట్ తో రాబోతున్నట్లు టాక్.

ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాలి. కానీ కోవిడ్ విజృంభిస్తుండడంతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలామంది బడా హీరోల చిత్రాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మీడియం, చిన్న తరహా చిత్రాల నిర్మాతలైతే ఓటిటి వైపు చూస్తున్నారు.

గత కొన్ని రోజులుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంపై ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓటిటి లో నేరుగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ సంస్థ క్లారిటీ ఇవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

తమ బ్యానర్ నుంచి రాబోతున్న చిత్రాలేవీ నేరుగా ఓటిటిలో రిలీజ్ కావని గీతా ఆర్ట్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తేనే అభిమానులకు ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఓటిటిలో అంత మజా ఉండదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అఖిల్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. గోపీ సుందర్ సంగీత దర్శకుడు.

More News

యాస్ తుపాను ఎఫెక్ట్... 25 రైళ్ల రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 24 నుంచి మే 29వ తేదీ వరకు మొత్తం

హాట్ పిక్ : ప్రియాంక అందుకే వరల్డ్ ఫేమస్

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. భారీగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

రాంగోపాల్ వర్మ సోదరుడు మృతి.. బోనీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన సోమశేఖర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కరోనాతో భాదపడుతున్న

కొవాగ్జిన్ తీసుకున్నారా? అయితే ఆ దేశాల్లోకి నో ఎంట్రీ..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే తమ దేశాల్లోకి ఎంట్రీ అనే నిబంధనను పలు దేశాల్లో అమల్లోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాలు నిబంధనలకు సిద్ధమవుతున్నాయి.