అజిత్ సినిమా విష‌యంలో మ‌ళ్లీ రూమర్స్‌

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ నాలుగో సినిమాగా 'విశ్వాసం'. ఇందులో అజిత్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమాను సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సినిమా 'పేట్ట' సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి అజిత్ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే దీనిపై అజిత్ సినిమా నిర్మాణ సంస్థ స‌త్య‌జ్యోతి ఫిలింస్ ఇటీవ‌లే క్లారిటీ ఇచ్చింది. తాము కూడా సంక్రాంతికే రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ర‌జనీ పేట్ట పోస్ట్ పోన్ అవుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో నిన్న 'పేట్ట' టీమ్ తాము సంక్రాంతికే రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా ఇప్పుడు మ‌ళ్లీ అజిత్ 'విశ్వాసం' విడుద‌ల‌పై చ‌ర్చ మొద‌లైంది. దాదాపు ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేస్తార‌ని ప్ర‌స్తుతం కోలీవుడ్ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి దీనిపై మ‌ళ్లీ నిర్మాణ సంస్థ ఎలా ప్ర‌క‌టన చేస్తుందో చూడాలి.