సింగర్ సునీత పెళ్లిపై మళ్ళీ గుసగుసలు

  • IndiaGlitz, [Sunday,November 29 2020]

టాలీవుడ్‌లో సునీత ప్రముఖ సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తన జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భర్త నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సునీత రెండో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనని తెలుస్తోంది. డిజిటల్‌ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌ మ్యాన్‌‌ను సునీత వివాహం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

కాగా... సునీతకు 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన కొన్నేళ్ల పాటు ఆయనకు దూరంగా ఉంటున్నారు. అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానని సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా.. ఇటీవల రెండో వివాహంపై ఓ ఇంటర్వ్యూలో సునీత స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పారు. అయితే తాజాగా సునీత మనసు మార్చుకుని వివాహానికి సిద్ధమయ్యారంటూ టాక్ నడుస్తోంది. దీనిపై సునీత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలాబలాలివే..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది.

ఐదేళ్లయ్యింది.. ఏం చేసావో చెప్పు?: కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్సీ కవితకు బండ్ల గణేష్ కౌంటర్..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరును ప్రస్తావిస్తూ.. బండి సంజయ్.. ఆయనకు మించిన కమెడియన్ అయ్యారని కేసీఆర్ తనయురాలు..

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి - ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సినిమా థియేటర్లు రీ-ఓపెనింగ్‌తో పాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం

మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య..?

బాలకృష్ణ తన 106వ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.