సింగర్ సునీత పెళ్లిపై మళ్ళీ గుసగుసలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో సునీత ప్రముఖ సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తన జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భర్త నుంచి విడిపోయి పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సునీత రెండో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనని తెలుస్తోంది. డిజిటల్ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్ మ్యాన్‌ను సునీత వివాహం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
కాగా... సునీతకు 19 ఏళ్ల వయసులోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన కొన్నేళ్ల పాటు ఆయనకు దూరంగా ఉంటున్నారు. అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానని సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా.. ఇటీవల రెండో వివాహంపై ఓ ఇంటర్వ్యూలో సునీత స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పారు. అయితే తాజాగా సునీత మనసు మార్చుకుని వివాహానికి సిద్ధమయ్యారంటూ టాక్ నడుస్తోంది. దీనిపై సునీత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout