మతం మార్చుకున్న నటి సంజనా.. తీవ్ర స్థాయిలో రూమర్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన శ్యాండిల్ వుడ్ బ్యూటి, బహుబాష నటి సంజనా గల్రాని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అవడం.. జైలుకు వెళ్లడం అనేవి చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మడి గురించి మరో టాక్ కూడా నడుస్తోంది. సంజనా మతం మార్చుకుందంటూ టాక్ బాగా నడుస్తోంది. లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా మతం మార్చుకోవడమే కాకుండా తన పేరును మహిరాగా మార్చుకుందని.. ప్రముఖ ఆర్‌టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చెయ్యడంతో ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు.
సంజనాపై మొదటి నుంచి ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 2018లోనే ఆమె ఇస్లాం మతం స్వీకరించి తన పేరును మహిరాగా మార్చుకుందని ప్రశాంత్ ఫేస్ బుక్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. కాగా.. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు సంజనాను అరెస్టు చేసి చార్జ్ షీటు తయారు చేసి కోర్టులో సమర్పించారు. వారం రోజులకు పైగా ఆమెను విచారించి పలు వివరాలు సేకరించారు. అయితే సీసీబీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్ షీటులో ఆమె పేరు నటి సంజనా గల్రాని అని మాత్రమే నమోదైంది. ఎక్కడా కూడా మహిరా అనే పేరు లేకపోవడం గమనార్హం.
అయితే సంజన.. ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్లాం మతం ఆచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా సంజనా, డాక్టర్ అజీజ్‌ల పెళ్లి వాయిదా పడింది.
కాగా.. దరుల్ ఉలుమ్ షా వలివుల్లా అనే పేరుతో ఫేస్ బుక్‌లో ప్రశాంత్ సంబర్గి ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇక ముందు నటి సంజనా అలియాస్ అర్చనా మనోహర్ గల్రానిని ఆ పేర్లతో పిలవకూడదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించిందని, ఆమెను మహిరా అని పిలవాలని తెలిపారు. అంతేకాదు.. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు పాలైనప్పటి నుంచి ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుతం బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్‌తో కలిసి సంజనా శ్రీలంక టూర్‌కు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments