రకుల్ ఆ స్టార్‌ను బుట్టలో వేసుకుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే అజయ్ దేవగణ్ దర్శక నిర్మాణంలో చేస్తున్న మేడే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో బాలీవుడ్ సినిమాలో నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా చేస్తున్న ‘థాంక్ గాడ్’ సినిమాలోనూ రకుల్ హీరోయిన్గా అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇలా వరుసగా అజయ్ దేవగణ్ సినిమాల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాలు దక్కించుకుటుండటంతో అజయ్ దేవగణ్‌ను రకుల్ బుట్టలో వేసుకుందా రకుల్ అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ వార్తలపై రకుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఈ ఫిట్నెస్ ఫ్రీక్ కోవిడ్ సమయంలో ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన షూటింగ్లో పాల్గొని సినిమాను పూర్తి చేసేసింది. అయితే ఏం చేద్దాం. ఎక్కడో పొరపాటు జరగడంతో రకుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రకుల్ హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంది. రీసెంట్గా కరోనా టెస్టులో కరోనా నెగటివ్ వచ్చింది. దీని తర్వాత ఖాళీగా కూర్చోవాలని రకుల్ ప్రీత్ సింగ్ అనుకోలేదు. వెంటనే షూటింగ్స్‌కు రెడీ అంటూ దర్శక నిర్మాతలకు సంకేతాలిచ్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout