‘దృశ్యం’ దర్శకుడు మృతి అంటూ పుకార్లు.. మాధవన్ సహా సంతాపం..

హిందీ ‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి చెందారంటూ ఆయన సన్నిహితుడు చెప్పిన మాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన ప్రముఖ నటుడు మాధవన్ సహా మరికొందరు సినీ సెలబ్రిటీలు కామత్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా మాత్రమే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన సన్నిహితుడు మిలాప్ జవేరి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు.

బాలీవుడ్‌లో ‘దృశ్యం, ముంబై మేరీ జాన్, మదారి’ తదితర చిత్రాలను తెరకెక్కించిన నిషికాంత్ కామత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కామత్ సన్నిహితుడు మరాఠి నటుడు జయవంత్ వాడ్కర్ మాట్లాడుతూ.. ఆయన చనిపోయారని వెల్లడించారు. ఆ తరువాత నటుడు మాధవన్ సహా మరికొందరు సెలబ్రిటీలు కామత్ మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేశారు.

కాగా.. తొలుత కామత్ జాండీస్‌తో పాటు మరో సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని పరీక్షలు నిర్వహించగా తీవ్ర కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిందన్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కామత్ సన్నిహితుడు మిలాప్ జవేరి సైతం తొలుత ఆయన మరణించారని ట్వి్ట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం హాస్పిటల్‌లో కామత్‌తో ఉన్నవారికి కాల్ చేశానని.. ఆయన మరణించలేదని.. మరింత క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నారని వెల్లడించారు.

More News

సంప‌త్‌నంది క‌థ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా

తెలంగాణలో కరోనా నుంచి కాస్త ఊరట.. తాజాగా ఎన్నంటే..

తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పార్లమెంట్ అనెక్స్ భవనంలో చెలరేగిన మంటలు..

పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.

ఓ వ్యక్తి ప్రాణం కోసం పుణె నుంచి హైదరాబాద్‌కు గంటలో లంగ్స్ తరలింపు

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించడమే కష్టంగా ఉంది.

కాజ‌ల్‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.