రామ్ చ‌ర‌ణ్ సినిమాకి అవేమీ టైటిల్స్ కాద‌ట‌

  • IndiaGlitz, [Wednesday,May 02 2018]

రంగ‌స్థ‌లంతో చాలా కాలం త‌రువాత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చేస్తున్నారు. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ కుటుంబ క‌థా చిత్రంలో చ‌ర‌ణ్‌కు అన్న‌య్య‌లుగా ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్, న‌వీన్ చంద్ర న‌టిస్తున్నారు. కియరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి తాజాగా రాజ‌వంశ‌స్థుడు, రాజ‌మార్తండ వంటి టైటిల్స్ వినిపించాయి. అయితే.. ఇవేవీ ఈ సినిమా టైటిల్స్ కాద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే అధికారికంగా టైటిల్ ప్ర‌క‌టిస్తామ‌ని.. క‌థ‌కు త‌గ్గ టైటిల్ కోస‌మే ప్ర‌య‌త్నిస్తామ‌ని చిత్ర బృందం పేర్కొంటోంది.  ఇటీవ‌లే రెండో షెడ్యూల్ ప్రారంభించుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకి సంగీత‌మందిస్తున్నారు.

More News

'భరత్ అనే నేను'.. మే 4 నుంచి 'హోలీ' ఫైటింగ్ సీన్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’.

నెల‌కో సినిమాతో గోపీసుంద‌ర్‌

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాసిక్ ఫిల్మ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సంగీత దర్శకుడు గోపి సుందర్.

విలన్‌ గా మారిన‌ రచయిత

అబ్బూరి రవి.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు. మాటల రచయితగా 'ఎలా చెప్పను'తో టాలీవుడ్‌కు పరిచయమైన ర‌వి.. పాతిక సినిమాలకు పైగా మాటలను అందించారు.

మనాలీ కి కొలీవుడ్ ఆఫర్

స్వాతి, శ్రీ దివ్య, ఆనంది.‌.  వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్  కధానాయికలుగా వెలుగొందినవారు.

రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో