రామ్ చరణ్ సినిమాకి అవేమీ టైటిల్స్ కాదట
Send us your feedback to audioarticles@vaarta.com
రంగస్థలంతో చాలా కాలం తరువాత బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ను చేస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రంలో చరణ్‌కు అన్నయ్యలుగా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, నవీన్ చంద్ర నటిస్తున్నారు. కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి తాజాగా రాజవంశస్థుడు, రాజమార్తండ వంటి టైటిల్స్ వినిపించాయి. అయితే.. ఇవేవీ ఈ సినిమా టైటిల్స్ కాదని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే అధికారికంగా టైటిల్ ప్రకటిస్తామని.. కథకు తగ్గ టైటిల్ కోసమే ప్రయత్నిస్తామని చిత్ర బృందం పేర్కొంటోంది. ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభించుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments