Vijay Antony : షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్ ఆంటోనీ ఆరోగ్యంపై వదంతులు, భయాందోళనల్లో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణ సౌండ్ ఇంజనీర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోనీ (Vijay Antony) .. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా తన విలక్షణ నటనతో భారతదేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. నకిలీ, డాక్టర్, సలీం చిత్రాలతో తనలోని నటుడిని బయటకు తీసిన విజయ్ ఆంటోనీకి.. బిచ్చగాడు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ బిచ్చగాడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాతి నుంచి విజయ్ ఆంటోనీ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూడటం మొదలుపెట్టారు.
సిబ్బంది బోటును ఢీకొట్టిన విజయ్ పడవ:
ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బిచ్చగాడు 2 సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. విజయ్ ప్రయాణిస్తున్న బోట్ పక్కనే వున్న క్రూ సిబ్బంది పడవని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటన తర్వాత విజయ్‌ని మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చినట్లుగా కోలీవుడ్ మీడియా తెలిపింది.
చెన్నైలో విజయ్ ఆంటోనీకి చికిత్స :
ప్రస్తుతం విజయ్ ఆంటోనీకి చికిత్స జరుగుతుండటంతో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను విజయ్ ఆంటోనీ సన్నిహితులు కొట్టిపారేశారు. ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలు మాత్రమే తగిలాయని, విజయ్ ఇప్పటికే కోలుకున్నారని తెలిపారు. ఇకపోతే.. బిచ్చగాడు 2ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. బిచ్చగాడుకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై దక్షిణాదిలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments