Rules Ranjan:ప్రముఖ ఓటీటీలో 'రూల్స్ రంజన్'.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణివారు' సినిమాతో అరంగేట్రం చేశాడు. పక్కింటి కుర్రాడిలా నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణ మండపం', 'వినరో విష్ణు భాగ్యము కథ' వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కిరణ్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. వరుస సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'రూల్స్ రంజన్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు.
అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సమ్మోహనుడా అనే సాంగ్ మాత్రం బాగా పాపులర్ అయ్యింది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది కామెడీ మాత్రం కొద్దిగా ప్రేక్షకులను అలరించింది. తిరుపతికి చెందిన హీరో ముంబైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ స్ట్రీట్‌గా రూల్స్ పాటిస్తుంటాడు. అలాంటి హీరో జీవితంలోకి కాలేజ్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి మళ్లీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆమెను పెళ్లి చేసుకునేందుకు రంజన్ వేసిన ఎత్తులేంటి? అనేది మిగతా కథ.
ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 'రూల్స్ రంజన్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. థియేటర్స్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments