Rules Ranjan:ప్రముఖ ఓటీటీలో 'రూల్స్ రంజన్'.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Wednesday,November 29 2023]

యువ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణివారు' సినిమాతో అరంగేట్రం చేశాడు. పక్కింటి కుర్రాడిలా నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. 'ఎస్ఆర్ కల్యాణ మండపం', 'వినరో విష్ణు భాగ్యము కథ' వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కిరణ్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. వరుస సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'రూల్స్ రంజన్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు.

అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సమ్మోహనుడా అనే సాంగ్ మాత్రం బాగా పాపులర్ అయ్యింది. వెన్నెల కిషోర్‌, హైపర్ ఆది కామెడీ మాత్రం కొద్దిగా ప్రేక్షకులను అలరించింది. తిరుపతికి చెందిన హీరో ముంబైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ స్ట్రీట్‌గా రూల్స్ పాటిస్తుంటాడు. అలాంటి హీరో జీవితంలోకి కాలేజ్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి మళ్లీ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆమెను పెళ్లి చేసుకునేందుకు రంజన్‌ వేసిన ఎత్తులేంటి? అనేది మిగతా కథ.

ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 'రూల్స్ రంజన్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. థియేటర్స్‌లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

More News

Celebrities:హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఓటేయనున్నారో తెలుసా..?

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

Sudigali Sudheer:ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను.. ‘కాలింగ్ సహస్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.

Vote:ఓటు హక్కు వినియోగించుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..

ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉండే పవర్ అంతాఇంతా కాదు. దేశ పౌరుడు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే హక్కు ఇచ్చేది ఓటు హక్కు.

Hrithik Tarak:హృతిక్, తారక్ 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు.

Kaushik Reddy:కౌశిక్‌రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర ఆగ్రహం.. విచారణకు ఆదేశం..

తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో