రూలర్ టీజర్ : యూనిఫాం తీశానో ఆగను.. వేటే!
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు అప్డేట్స్ను ఇచ్చిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను రిలీజల్ చేసింది. కాగా ఈ టీజర్ చూసిన నందమూరి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వాస్తవానికి బాలయ్య సినిమా అంటే తుక్కు తుక్కుగా ఫైట్స్ ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్. ఇదిగో తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ను మీరూ చూసేయండి.
ఫైట్లే ఫైట్లు!
టీజర్ ఎలా ఉందనే విషయానికొస్తే.. ఎప్పటిలానే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్‌తో ‘రూలర్’ టీజర్ మొదలైంది. ‘ధర్మ.. మా ఊరికే గ్రామ దైవం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే మందుంటాడు’ అనే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి మోత మోగిపోయింది. పాత్రల పరిచయం, భారీ డైలాగ్, రెండు మూడు ఫైట్లు, పాటలతో టీజర్‌ను చూపించారు. సినిమా ఎలా ఉండబోతోందో టీజర్లో మూడు ముక్కల్లో చూపించేశారు. బాలయ్య సినిమాలంటే ఫైట్స్, డైలాగ్స్, యాక్షన్‌కు కొదువ ఉండదన్న విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ గత సినిమాల మాదిరిగానే రొటీన్ యాక్షన్ మసాలాలా అనిపిస్తోంది.
డైలాగ్స్ అదుర్స్ బాలయ్యా..!
డైలాగ్స్ విషయానికొస్తే.. టీజర్ మొత్తమ్మీద .. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోన్లో పెట్టిన సింహంలా ఉంటాను.. యూనిఫాం తీశానో.. బయటికొచ్చిన సింహంలా ఆగను. ఇక వేటే..’ అంటూ సాగే పవర్ ఫుల్ డైలాగ్ అదుర్స్ అనిపించింది. ఈ డైలాగ్ నిజంగా నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలకు స్పెషల్ ఫీస్టే అని చెప్పుకోవచ్చు. కాగా.. సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర చాలా స్టైలిష్‌గా.. మరోటి పోలీస్ పాత్ర. ఈ సినిమాలో జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా టీజర్లో వీరి పాత్రలను కూడా పరిచయం చేసింది చిత్రబృందం. మరి ట్రైలర్ ఎప్పుడొస్తుందో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com