చిరు ‘రుద్రవీణ’ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు!

  • IndiaGlitz, [Thursday,November 07 2019]

టాలీవుడ్‌లో అప్పట్లో.. మాస్ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో చిరంజీవి తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సామాన్య పాత్రలో అసామాన్య చిత్రం ‘రుద్రవీణ’. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించారు. చిరంజీవికి నటన పరంగా ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన చిత్రం ‘రుద్రవీణ’. ఆయన సీని కెరీర్లో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా.. కలికితు రాయిగా నిలిచిందన్న విషయం తెలిసిందే. ఇందులోని పాటలు కూడా జనాలకు ఇప్పుడు గుర్తుండిపోతాయ్. మరీ ముఖ్యంగా ‘చుట్టూ పక్కల చూడరా...’, ‘నమ్మద్దు నమ్మద్దు ఈ రేయినీ...’ ఈ పాటలు ఎప్పుటికీ గుర్తుండిపోతాయ్. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రుద్రవీణ గురించి ప్రస్తావనకు తెచ్చారు.

ఏపీలో భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పవన్ ఈ కింది వ్యాఖ్యలు చేశారు. ‘రుద్రవీణ... నాకు స్ఫూర్తినిచ్చే చిత్రం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా జీతభత్యాలు తీసుకొంటున్న వైసీపీ నేతలకు రుద్రవీణలోని పాటలు మేలుకొలుపు’ అని పవన్ చెప్పుకొచ్చారు. జీతాలు, తెచ్చిన అప్పులకి వడ్డీలు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్ర ఆదాయం పడిపోతోంది. అప్పులు రూ.3.50 లక్షల కోట్లకి చేరాయి. సంపాదించిన సొమ్ముతో ఉచిత పథకాలుపెట్టండి... అప్పు తెచ్చిన డబ్బుతో కాదు. ఇప్పుడైనా మేల్కొండి వైఎస్‌జగన్‌’ అని పవన్ వరుస ట్వీట్స్ చేశారు. పవన్ చేసిన ఈ ట్వీట్స్‌కు జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు స్పందిస్తూ.. పవన్, జనసేనాని అభిమానులపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

More News

జక్కన్న ‘RRR’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి

మద్యం నియంత్రణపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మద్యం నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

చివరిదశలో ఉన్న ‘జేసీ’తో మాకేం పని: మంత్రి నాని

టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పీఏసీ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత..

అనంతంపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు అమరావతిలో

మోహన్‌బాబుకు వైఎస్ జగన్ హామీ.. త్వరలో కీలక పదవి!?

ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత మోహన్‌ బాబు..