30 వసంతాల 'రుద్రవీణ'

  • IndiaGlitz, [Sunday,March 04 2018]

“ప‌దుగురి సౌఖ్యాన్ని మించిన పండగ లేద‌”ని చాటి చెప్పిన‌ చిత్రం రుద్ర‌వీణ‌'. రామాపురంలో సంగీతం నేప‌థ్యం క‌లిగిన సాంప్ర‌దాయ‌మైన బ్రాహ్మ‌ణ కుటుంబం బిళ‌హ‌రి గ‌ణ‌ప‌తిశాస్త్రిది. ఆయ‌న‌ రెండో కుమారుడు సూర్యం (సూర్యనారాయ‌ణ శాస్త్రి). తండ్రి నీడ‌లో పెరిగే సూర్యానికి సంగీతం, వేదాలు త‌ప్ప ఇంకేమీ తెలీదు. ఒక సంద‌ర్భంలో దేవుడు మ‌నిషికి రెండు చేతులిచ్చింది.. ఒక‌టి త‌న‌కోసం, మ‌రోటి ప‌రోప‌కారం కోసం అని తెలుసుకుంటాడు. అప్ప‌టినుంచి అంచెలంచెలుగా మారుతూ.. చివర‌కు తాగుడే అన్నీ నేరాల‌కు మూలం అని తెలుసుకుని.. దాన్ని ఆ ఊరి నుంచి త‌రిమేయాల‌నే క్ర‌మంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి.. ఆఖ‌రికి క‌న్న తండ్రిని, కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని, చివ‌ర‌కు త‌న జీవితాన్ని కూడా ప‌ణంగా పెట్టి ఆ ఊళ్లో ఎవ‌రూ తాగ‌కుండా.. వాళ్ల మార్పుకి కార‌ణం అవుతాడు సూర్యం.

అంతేకాదు.. ఆ ఊళ్లో ప్ర‌భుత్వం చేప‌ట్టాల్సిన ప‌థ‌కాల‌ను ఆ గ్రామ ప్ర‌జ‌లే తమ‌కు తాముగా ఏర్పాటు చేసుకోవ‌డంతో.. చుట్టు ప‌క్క‌ల మ‌రికొన్ని గ్రామాల‌కు కూడా రామాపురం ఆదర్శమవుతుంది. ఇలా మాన‌వ‌త్వ‌పు విలువ‌ల‌తో ప‌దిమంది సుఖ‌మే త‌న సుఖం అని న‌మ్మే సూర్యం క‌థే ఈ సినిమా. ఇందులో సూర్యంగా చిరంజీవి న‌ట‌న అద్భుత‌మ‌నే చెప్పాలి. మిగిలిన పాత్ర‌ల్లో జెమినీ గ‌ణేష‌న్, శోభ‌న‌, ప్ర‌సాద్ బాబు, ర‌మేష్‌ అర‌వింద్, పి.ఎల్.నారాయ‌ణ త‌దిత‌రులు న‌టించారు. ఇళ‌య‌రాజా సంగీతంలోని అన్ని పాట‌లు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ఈ పాట‌ల‌కు సిరివెన్నెల సాహిత్యం మ‌రింత అందం తెచ్చింది. అలాగే ఆ పాట‌ల్లో ప్ర‌కృతి, మాన‌వ‌త్వం తాలుకు ఛాయ‌లు ప్ర‌తిబింబిస్తుంటాయి. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మూడు జాతీయ, నాలుగు నంది అవార్డుల‌తో పాటు స్పెష‌ల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. ఇదే సినిమాని క‌మ‌ల్ హాస‌న్‌తో త‌మిళంలో రూపొందించారు. మార్చి 4, 1988న విడుద‌లైన రుద్ర‌వీణ‌' నేటితో 30 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

More News

బయోపిక్.. దర్శకుడు కూడా బాలయ్యేనా?

మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం'యన్.టి.ఆర్.’

అల్లరి నరేష్ 55వ చిత్రం ప్రారంభం

కామెడీ కింగ్ అల్లరి నరేష్,టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్ లో

నాని విడుదల చేసిన 'పరిచయం' టీజర్

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై హైద్రాబాద్ నవాబ్స్ మూవీ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో

రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ చిత్రం టాకీ పూర్తి

ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

మార్చి 16 నుండి 'శ్రీనివాస కల్యాణం' రెగ్యులర్ షూటింగ్

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...